Saturday, January 4, 2025

AP – ఆ మూడు మూవీల ధరల పెంపు, బెన్ ఫిట్ షో లకు గ్రీన్ సిగ్నల్

వెలగపూడి – సంక్రాంతి పండుగ వేళ.. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ సందర్భంగా సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

బెనిఫిట్‌ షోలకు అనుమతి

ఇక సంక్రాంతి బరిలో మొదటగా వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్‌. రామ్‌చరణ్‌, కియారా అడ్వానీ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. ఎస్‌.జె సూర్య విలన్‌గా కనిపించనున్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా బడ్జెట్ రూ.450 కోట్లు కావడం విశేషం. ఈ మూవీకి దిల్‌ రాజు దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన గేమ్‌ ఛేంజర్‌ సినిమాకి మొదటి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్‌ థియేటర్‌లో రూ.135, మల్టీప్లెక్స్‌ల్లో రూ.175 టికెట్ల రేట్లను పెంచేందుకు అనుమతి ఇచ్చారు. అంతేకాదు, పరిమిత బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇవ్వడంతో పాటు.. టికెట్ల రేట్లను రూ.600లుగా నిర్ణయించారు.

- Advertisement -

ఢాకూ మహారాజ్‌…..

అభిమానుల్లో భారీ అంచనాలుమరోవైపు ఢాకూ మహారాజ్‌గా సంక్రాంతి బరిలోకి దిగారు నందమూరి బాలకృష్ణ. వాల్తేరు వీరయ్యతో చిరంజీవికి హిట్ ఇచ్చిన బాబీ.. ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 12వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. దుల్కర్ సల్మాన్‌, బాబీ డియోల్ వంటి స్టార్ కాస్ట్ ఉండడం ఈ మూవీకి మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ మూవీకి కూడా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. సింగిల్ స్క్రీన్‌ థియేటర్‌లో టికెట్‌పై రూ.110, మల్టీప్లెక్స్‌ల్లో రూ.135 పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

సంక్రాంతి వస్తున్నాం

విక్టరీ వెంకటేష్‌, దర్శకుడు అనిల్ రావిపుడి కాంబినేషన్‌లో “సంక్రాంతి వస్తున్నాం” అనే సినిమా విడుదల కానుంది. ఈ నెల 14 థియేటర్స్‌లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. మిగతా రెండు సినిమాలతో పాటు ఈ సినిమాకు కూడా ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచింది. సింగిల్ స్క్రీన్‌ థియేటర్‌లో టికెట్‌పై రూ.75, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

.తెలంగాణలో నిరాకరణఇటు తెలంగాణ ప్రభుత్వం మాత్రం బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతి నిరాకరించింది. సంథ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచమని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

దీంతో తెలంగాణలో సినిమా నిర్మాతలకు నిరాశ కలిగించే విషయం తెలిసిందే. సినీ ప్రముఖులు వెళ్లి, సీఎంను స్వయంగా కలిసి విన్నవించినా ఫలితం లేకుండా పోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement