Friday, November 22, 2024

omicron: ఒమిక్రాన్ పై ఏపీ సర్కార్ కీలక మార్గదర్శకాలు

దేశంలో ఒమిక్రాన్ కేసులు వెలుగు చేస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. తాజాగా ఒమిక్రాన్ వ్యాప్తి నివారణకు ఏపీ ప్రభుత్వం మరోమారు మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్రం, డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించని వారికి రూ.100తో పాటు మాస్కు లేని వారిని దుకాణాలకు రానిస్తే యాజమాన్యానికీ భారీ జరిమానా విధించాలని ఆదేశించింది.

నిబంధనలు ఉల్లంఘిస్తే దుకాణాలు,వాణిజ్య ప్రదేశాలకు రూ.10 నుంచి రూ.25 వేల జరిమానాతో పాటు సంస్థలను 2 రోజుల పాటు మూసివేసేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఉల్లంఘనలపై ప్రజలు వాట్సాప్‌ నం. 8010968295కు ఫిర్యాదు చేయాలని సూచించింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీ, పోలీసుకమిషనర్లకు ఉత్తర్వులు పెర్కొంది. తక్షణమే ఈ అదేశాల్లోకి వచ్చేలా ఉత్తర్వులు ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement