కోకరోనా మహమ్మారి చాలా కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. ఎంతో మంది అయిన వారిని కుటుంబాలకు దూరం చేసింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 50 వేల రూపాయల పరిహారం అందించనుంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి చెల్లించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పరహారం చెల్లింపు కోసం కలెక్టరేట్‌లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనున్నారు. మృతుల జాబితా రూపొందించి చెల్లింపులు చేయాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. దరఖాస్తు తీసుకున్న 2 వారాల్లోగా పరిహారం సొమ్మును కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు.
ఇది కూడా చదవండి: Inida Corona: దేశంలో తగ్గిన కరోనా.. పెరిగిన మరణాలు