Tuesday, November 26, 2024

Breaking: సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాల‌తో ఏపీ ప్ర‌భుత్వం చ‌ర్చ‌లు

సీపీఎస్‌ రద్దు చేయాలంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళ‌న‌కు చేస్తున్న వేళ‌ ఏపీ ప్రభుత్వం స్పందించింది. సీపీఎస్ అంశంపై ఉద్యోగ సంఘాల‌తో ఏపీ ప్ర‌భుత్వం చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నుంది. ఈరోజు సాయంత్రం స‌చివాల‌యంలో మంత్రులు, జాయంట్ స్టాఫ్ కౌన్సిల్ స‌భ్యుల‌తో ఉద్యోగ సంఘాలు భేటీ కానున్నాయి. ఈ భేటీకి హాజ‌రు కావాల‌ని 16 ఉద్యోగ సంఘాల నేత‌ల‌కు ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఆహ్వానాలు పంపింది. అయితే యూటీఎఫ్ త‌ల‌పెట్టిన నిర‌స‌న‌ను ప్ర‌భుత్వం ఎక్క‌డిక‌క్క‌డ అణ‌చివేసిన నేప‌థ్యంలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ ఆహ్వానాన్ని ఏ మేర‌కు మ‌న్నిస్తాయ‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

ఇదిలా ఉండగా ఛలో సీఎంవో పిలుపు సందర్భంగా విజయవాడలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. నగరంలో 144 సెక్షన్‌ను విధించి 30 యాక్ట్‌ను అమలు చేస్తున్నారు. సీఎంవో కార్యాలయం వద్ద బారికెడ్లు ఏర్పాట్లు చేశారు. విజయవాడలోని హోటల్స్‌, లాడ్జీలు, రైల్వే స్టేషన్‌, బస్టాండ్ల వద్ద నిఘా ఉంచారు. విజయవాడ వైపు వచ్చే అన్ని దారుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ద్విచక్రవాహనాలతో సహా అన్ని రకాల వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement