Monday, November 25, 2024

Online Tickets: హైకోర్టు తీర్పుపై అపీళ్లకు ఏపీ సర్కార్

ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. పాత పద్ధతిలోనే టికెట్ల అమ్మాలని తెలిపింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాల్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సామాన్య ప్రజల ప్రయోజనాల దృష్ట్యా డివిజన్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్లనుంది. 

సామాన్య ప్రజల ప్రయోజనం రీత్యా ఏపీలో సినిమా టికెట్ల ధరలను ప్రభుత్వం ఇటీవల భారీగా తగ్గించింది. ఆన్ లైన్ లో టికెట్ల అమ్మకం విధానం తీసుకువచ్చింది. దీనికి సంబంధించి జీవో నెం.35 జారీ చేసింది. అయితే ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డిస్టిబ్యూటర్లు, సినిమా థియేటర్ల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్లను నిన్న విచారించిన హైకోర్టు.. థియేటర్లలో టికెట్ల ధరలను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదన్న థియేటర్ల యాజమాన్యాల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. పాత పద్ధతిలోనే టికెట్ల రేట్లు పెంచుకోవచ్చంటూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ జీవోను హైకోర్టు నిలుపుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement