Friday, November 22, 2024

AP: ఇదొక సువర్ణ అధ్యాయం…రైట్‌ టు ఎడ్యుకేషన్‌.. సీఎంజ‌గ‌న్‌..

నాణ్యమైన విద్య అన్నది హక్కు… ఇది కొత్త నినాదమని చెప్పారు. నాణ్యమైన విద్యను అదించడంలో మనం వెనకబడితే… మిగతా వాళ్లు మనల్నిదాటి ముందుకు వెళ్లిపోతారని…ఈ దేశంలో ఉన్నవారితోకాదు మన పోటీ అని సీఎం జ‌గ‌న్ వాఖ్య‌నించారు. ప్రముఖ విద్యా పోర్టల్ ఎడ్‌క్స్‌తో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందన్నారు. రైట్‌ టు ఎడ్యుకేషన్‌ అన్నది పాత నినాదం అన్నారు.

- Advertisement -

ప్రపంచంతో మనం పోటీపడుతున్నామని..మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సాధించాలని తెలిపారు. మంచి మంచి జీతాలు సంపాదించాలని స్పష్టం చేశారు. నాణ్యమైన విద్యద్వారానే ఇది సాధ్యం.విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలని…అప్పుడు మన పిల్లలకు మెరుగైన అవకాశాలు వస్తాయని తెలిపారు. ఇప్పుడు మనం చేస్తున్నది ఒక ప్రారంభం మాత్రమేనని..ఫలాలు అందడానికి కొంత సమయం పట్టొచ్చన్నారు. కాని ఎక్కడో ఒకచోట ప్రారంభించాల్సిన అవసరం ఉందని వివరించారు సీఎం జగన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement