ఏపీలో విద్యుత్ కొరత నేపథ్యంలో పరిశ్రమలకు ప్రకటించిన పవర్ హాలిడేల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలకు ఒక్క రోజు పవర్ హాలిడేను ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా ఆయా కేటగిరీలకు చెందిన పరిశ్రమలకు విద్యుత్ వినియోగానికి సంబంధించిన పరిమితులను కూడా సడలిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం తగ్గిందని, ప్రస్తుతం విద్యుత్ వినియోగం 180 మిలియన్ యూనిట్లుగా ఉందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగం తగ్గిన నేపథ్యంలో పరిశ్రమలకు మరింత మేర విద్యుత్‌ను అందించనున్నామని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. అన్ని రకాల పరిశ్రమలకు 70 శాతం విద్యుత్ వినియోగానికి అనుమతినిస్తున్నామన్న మంత్రి.. ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజీలకు 100 శాతం విద్యుత్ వినియోగానికి అనుమతినిస్తున్నామని వెల్లడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement