Tuesday, November 26, 2024

టీటీడీ బోర్డు చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి రెండోసారి నియమితులయ్యారు. ఈ ఏడాది జూన్ లో ఆయన పదవీ కాలం పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ బాధ్యతలను మరోసారి ఆయనకే అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో టీటీడీ బోర్డు సభ్యుల నియామకం జరగనుంది.

ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. ఆయన పదవీ కాలం పూర్తయ్యాక మరో వ్యక్తిని నియమించే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. అయితే, సీఎం జగన్ మాత్రం మళ్లీ సుబ్బారెడ్డికే బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. సుబ్బారెడ్డికి రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో వైవీకి బెర్త్ ఖాయం అయిందని టాక్ కూడా వినిపించింది. అయితే సీఎం జగన్ మాత్రం టీటీడీ బోర్డు బాధ్యతు అప్పగించేందుకే మొగ్గు చూపారు.

ఇది కూడా చదవండిః జగన్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర : బీజేపీపై డిప్యూటీ సీఎం సంచలన ఆరోపణ

Advertisement

తాజా వార్తలు

Advertisement