ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును ఏపీ అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. దీంతో పాటు సీఆర్డీఏ రద్దు ఉపసంహరణ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. వాటిపైన ప్రస్తుతం అసెంబ్లీలో కీలక చర్చ జరుగుతోంది. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని శివరామ కృష్ణన్ కమిటీ సూచిందని ఈ సందర్భంగా మంత్రి బుగ్గన అన్నారు. అమరావతి ప్రాంతం సారవంతమైన, ఖరీదైన భూమి అని పేర్కొన్నారు. దాన్ని వృధా చేయవద్దని కమిటీ స్పష్టంగా చెప్పిందన్నారు. కాగా, మంత్రి బుగ్గన మాట్లాడిన తర్వాత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేయనున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement