పీఆర్సీపై ప్రభుత్వం విడుదల చేసిన జీవోను రద్దు చేయాలంటూ ఉద్యోగులు పోరు కొనసాగిస్తున్న వేళ.. ట్రెజరీ అధికారులకు ఏపీ ప్రభుత్వం మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. లాగిన్‌లో ఉన్న వేతన బిల్లులు అన్నింటినీ క్లియర్ చేయాలని ఆదేశించింది. సోమవారం సాయంత్రం లోపు వేతన బిల్లులు అన్నింటినీ ప్రాసెస్ చేయాలని పేర్కొంది.
పోలీస్, న్యాయ శాఖల ఉద్యోగుల బిల్లులను ట్రెజరీ ఉద్యోగులు ప్రాసెస్ చేస్తున్నారు. పదవ పీఆర్సీ ప్రకారం కొత్త సాఫ్ట్ వేర్‌లో బిల్లులను వెంటనే ప్రాసెస్ చేయలేకపోతున్నామని ఉద్యోగులు తెలిపారు. 25% బిల్లులు మాత్రమే ట్రెజరీకి వచ్చాయని ఉద్యోగులు చెబుతున్నారు. ట్రెజరీల నుంచి ప్రతి రెండు గంటలకు ఒకసారి నివేదిక పంపాలని ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.