Wednesday, November 20, 2024

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. 7,218 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు

ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది, 7,218 గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. తాజా పోస్టులను జిల్లా యూనిట్‌గా భర్తీ చేయాలని ప్రభుత్వం సూచించింది. గతంలో మండల, పట్టణ యూనిట్‌గా వాలంటీర్లను నియమించగా.. ఇప్పుడు గ్రామాల్లో 4,213, పట్టణాల్లో 3,005 వాలంటీర్ల ఖాళీల భర్తీకి జిల్లాను యూనిట్‌గా తీసుకోవాలని తెలిపింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వాలంటీర్ పోస్టుల భర్తీకి నెలలో రెండుసార్లు జాయింట్ కలెక్టర్లు నోటిఫికేషన్‌లు జారీ చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement