Sunday, November 24, 2024

అధిక విస్తీర్ణం, అధిక దిగుబడులే టార్గెట్‌.. ఇదే ఏపీ సర్కారు కొత్త సీడ్‌ పాలసీ

అమరావతి, ఆంధ్రప్రభ: విత్తనోత్పత్తిలో పరిమిత విస్తీర్ణం, సంప్రదాయ సాగు పద్ధతికి పూర్తిస్థాయిలో స్వస్తి పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సీడ్‌ పాలసీ-2021ను ప్రకటించింది. విత్తనోత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించట మే లక్ష్యంగా అధిక విస్తీర్ణం, అధికోత్పత్తి విధానానికి శ్రీకారం చుడుతూ సీడ్‌ పాలసీ ద్వారా సరికొత్త మార్గదర్శకాలను, కార్యాచరణను రూపొందించారు. నూతన పాలసీలో భాగంగా రాష్ట్రంలో తొలివిడతలో 1000 గ్రామాలను ఎంపిక చేసి హైబ్రిడ్‌ రకం విత్తనోత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో ఇప్పటికే 450 గ్రామాల్లో విత్తనోత్పత్తి చేస్తుండగా సీడ్‌ పాలసీ ద్వారా మరో 1000 గ్రామాలు.. మొత్తం 1450 గ్రామాల్లో ఎంపిక చేసిన భూముల్లో విత్తనాల పెంపకం చేపట్టేందుకు నిర్ణయించారు.

సుమారు 20 రకాల పంటలకు సంబంధించి 15 లక్షల క్వింటాళ్ల విత్తనాలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. రైతులు, రైతు సంఘాలతో పాటు- రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌.పీ.వో)ను విత్తనోత్పత్తిలో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 15 నుంచి 20 మంది రైతులతో కేవలం విత్తనోత్పత్తి కోసం కొత్త రైతు సంఘాలను ఏర్పాటు- చేయనున్నారు. విత్తనోత్పత్తిలో రైతులను వ్యక్తిగత స్థాయిలోనూ, రైతు సంఘాలనూ, ఎఫ్‌.పీ.వోలను ఉమ్మడి సాగు కోసం ఎంపిక చేయనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 5 లక్షల క్వింటాళ్ళ విత్తనాలను రైతులు ఉత్పత్తి చేస్తున్నట్టు- అంచనా. సీడ్‌ పాలసీ ద్వారా ప్రభుత్వం అందించే ప్రోత్సాహంతో 15 లక్షల క్వింటాళ్ల విత్తనోత్పత్తి సాధ్యమవుతుందని అధికారుల అంచనా.

విత్తనాలను అగ్రి ల్యాబుల్లో పరీక్షలు చేసిన అనంతరం నాణ్యత ధృవీకరణ పత్రాలను జారీ చేసి రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సబ్సిడీ ధరలకు విక్రయించాలనిప్రభుత్వం నిర్ణయిం చింది. మేలు రకం విత్తనో త్పత్తి కోసం ప్రభుత్వం వ్యవసాయ పరిశోధన సంస్థలతో పాటు- వ్యవ సాయ, ఉద్యాన యూనివర్శిటీ-ల్లోని శాస్ర ్తవేత్తల సహ కారం కోరుతోంది. మూల విత్తనోత్పత్తి, వాతావరణ అనుకూల వంగడాల అభివృద్దిపై ప్రత్యే కంగా దృష్టి కేంద్రీకరించాలని సీడ్‌ పాలసీ లో వెల్లడించారు. ఈ మేరకు రూ 50 కోట్లతో విత్తన పరిశో ధన, శిక్షణా కేంద్రం ఏర్పాటు-చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

- Advertisement -

వారణాసిలోని జాతీయ విత్తన పరిశోధన కేంద్రం కార్యకలాపాలను అధ్యయనం చేసి ఆ స్థాయిలో రాష్ట్రంలో పరిశోధన, శిక్షణా కేంద్రం ఏర్పాటు- చేసేందుకు స న్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రంలో సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు- 18 ఉండగా కొత్తగా మరో 33 యూనిట్లు- నెలకొల్పనున్నారు.రానున్న రెండేళ్లలో మూల విత్తనం నుంచి నూటికి నూరు శాతం విత్తన మార్పిడి చేయటం ద్వారా వచ్చే మేలు జాతి విత్తనాల తో నాణ్యత, దిగుబడిలో గణనీ యమైన ఫలితా లు సాధింవచ్చని వ్యవసాయశాఖ అధికారుల అంచ నా. మూల విత్తనాలను 3 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ దాకా భద్రపర్చేందుకు వీలుగా జెన్‌ బ్యాంకులను కూడా ఏర్పాటు- చేయనున్నారు.

ఏటా రూ 1500 కోట్ల వ్యాపారం
రాష్ట్రంలో విత్తనాల మార్కెట్‌ విలువ సుమారు రూ. 1,500 కోట్లు- ఉంటు-ందని అంచనా. అన్ని సీజన్లలో అన్ని పంటలకు కలిపి 25 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవ ుతాయి. వీటిలో సుమారు 13 లక్షల క్వింటాళ్ల విత్తనాల కొను గోలుకు రైతులు ప్రయివేట్‌ మార్కెట్లపైనే ఆధారపడు తున్నారు. సబ్సిడీ ద్వారా ప్రభుత్వం అందించే మరో 9 లక్షల క్వింటాళ్ల విత్తనాలు పోను..రైతులు తయారు చేసుకుంటు-న్న విత్తనాలు రూ 3 లక్షల క్వింటాళ్లు కూడా దాటటం లేదు. ఇపుడు కొత్తగా ప్రకటించిన సీడ్‌ పాలసీ ద్వారా 15 లక్షల క్వింటాళ్లను ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement