Tuesday, November 26, 2024

అక్రమ లేఅవుట్ల రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

రాష్ట్రవ్యాప్తంగా అక్రమ లేఅవుట్ల రిజిస్ట్రేషన్లపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ లేఅవుట్లను ఎట్టిపరిస్థితుల్లో రిజిస్ట్రేషన్‌ చేయవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.

ఇప్పటి వరకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు గుట్టు చప్పుడు కాకుండా అన్‌ ఆథరైజ్డ్‌ లే ఔట్లను రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథార్టీలు, డీటీసీపీల నుంచి ప్రత్యేక సూచనలు వస్తేనే అన్‌ ఆథరైజ్డ్‌ లే ఔట్ల రిజిస్ట్రేషన్లు సబ్‌ రిజిస్ట్రార్లు ఆపుతున్నారు. ఇకపై అన్‌ అథారైజ్డ్‌ లే ఔట్‌ రిజిస్ట్రేషన్లు చేయకూడదంటూ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖ స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement