ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జీవోలను ఆన్‌లైన్‌లో పెట్టవద్దని నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జీవోలను ఆఫ్ లైన్‌లోనే పెట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. ఈ అంశంపై అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులకు సమాచారం అందించింది. ఇటీవల బ్లాంక్ జీవోల జారీ వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పొరుగు రాష్ట్రాల విధానాలను అనుసరించాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో పబ్లిక్ డొమైన్లలో ఇకపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు కనిపించవు.
Advertisement
తాజా వార్తలు
Advertisement