అమరావతి – వాక్సిన్ కొరత ను అధికమించేందుకు ఎపి ప్రభుత్వం గ్లోబల్ టెండర్ లకు నోటిఫికేషన్ ఇచ్చింది. . కోటి మందికి వ్యాక్సిన్ వేసేందుకు టెండర్లను ఆహ్వానించింది. మే 13 వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి టెండర్ల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించింది. జూన్ 3 వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు టెండర్ల డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం సూచించింది. టెండర్ల టెక్నికల్ బిడ్‌ను అదే రోజు సాయంత్రం 5 గంటలకు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మే 20 న సాయంత్రం 5 గంటలకు ఫ్రీ బిడ్ మీటింగ్‌ను అధికారులు నిర్వహిస్తున్నారు. ఈ టెండర్లలో పాల్గొనేవారు ఏపీఎంఎస్ఐడీసీ పేరిట ఈఎండీ కింద 3 లక్షల రూపాయల డీడీ తీయాలని ప్రభుత్వం సూచించింది
Advertisement
తాజా వార్తలు
Advertisement