కోనసీమ జిల్లా విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చింది. ఈ మేరకు ప్రాథమిక ఉత్తర్వులను త్వరలోనే జారీ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఏపీలో రెండు నెలల క్రితం జిల్లాల విభజన జరిగింది. ఈ సందర్భంగా అల్లూరి, వైఎస్సార్, ఎన్టీఆర్ లాంటి మహనీయుల పేర్లను సీఎం జగన్ కొత్త జిల్లాలకు పెట్టారు. ఈ క్రమంలోనే కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని దళిత, ప్రజా సంఘాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వం కూడా నిర్ణయించుకుంది. అధికారికంగా ఉత్తర్వులు మాత్రం ఇంకా రావాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమగా జిల్లా పేరు మార్పు
Advertisement
తాజా వార్తలు
Advertisement