Thursday, November 21, 2024

ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు.. ఫైలుపై ఏపీ గవర్నర్ సంతకం

ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ఫైలుపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ సంతకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ఇటీవల ఏపీ ప్రభుత్వం పెంచింది. అయితే, గవర్నర్ సంతకం ఆలస్యం కావడంతో నేడు పదవీ విరమణ చేయనున్న ఉద్యోగుల్లో గందరగోళం నెలకొంది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపునకు సంబంధించి ప్రభుత్వం ఇంకా జీవో ఇవ్వకపోవటంతో అయోమయం నెలకొంది. ఆయా విభాగాలకు ఉద్యోగుల పదవీ విరమణల ఫైళ్లు చేరారు. దీంతో ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితిలో ఆర్ధిక శాఖ అధికారులు తర్జన భర్జన పడ్డారు.  

ఇటీవల కేబినెట్ లో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, దీనిపై ఆర్డినెన్సు జారీ కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకి ప్రభుత్వం పెంచుతూ.. మంత్రివర్గం తీర్మానం చేసి గవర్నర్‌కు పంపింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ఫైలుపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ సంతకం చేశారు. జనవరి ఒకటో తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. ఈ తీర్మానంతో ఈరోజు పదవీ విరమణ చేసే వారికి ఊరట లభించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement