ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖలో కొత్త పోస్టులను భర్తీ చేసేందుకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో ఏకంగా 2,190 కొత్త పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మొత్తం 2,190 పోస్టుల్లో.. 35 మెడికల్ కాలేజీలు, అనుబంధ ఆస్పత్రుల్లో 51 ప్రొఫెసర్లు, 187 అసోసియేట్ ప్రొఫెసర్లు, 130 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 1040 నర్సింగ్ పోస్టులు, 782 పారామెడికల్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వంపై అధికారులను ఆదేశించింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో వైద్య శాఖలో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా విపత్కర సమయంలో వైద్య శాఖను బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily