మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు చట్టాలను ఉపసంహరించుకున్నట్టు ఏపీ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. శాసనసభ, శాసనమండలిలో ఉపసంహరణ బిల్లులను ఆమోదించినట్టు అఫిడవిట్‌లో పేర్కొంది. ప్రభుత్వం తరఫున పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఈ అఫిడవిట్‌ను హైకోర్టులో దాఖలు చేశారు.
ఈ నెల 22న మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకుంటూ సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. తొలుత సీఎం జగన్ అధ్యక్షతన అత్యవసరంగా సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం.. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి పాలన వికేంద్రీకరణ చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అనంతరం ఈ బిల్లులను అసెంబ్లీ, మండలిలో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది. అయితే, ఈ బిల్లులో మార్పు చేసి మరోసారి సభ ముందకు తీసుకువస్తామని సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసందే.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital