Wednesday, November 20, 2024

ఎంఎస్‌ఎంఈ ల విస్త‌ర‌ణ‌కు ప్ర‌ణాళిక‌…

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ప్రతి అసెంబ్లి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కుల్ని ఏర్పా టు చేసే దిశగా పరిశ్రమలశాఖ అడుగులు వేస్తోంది. తొలి విడతగా 75 పార్కుల్ని కనిష్టంగా 25 ఎకరాలు గరిష్టంగా 200 ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు యాక్షన్‌ప్లాన్‌ రూపొందిస్తున్నారు. మార్చి 31వ తేదీ లోపు భూ కేటాయింపులు జరిపేందుకు కసరత్తు చేస్తున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. వీటి ఏర్పాటుతో 12,800 కోట్లు పెట్టుబడులు వస్తా యని అంచనా. ఇప్పటికే 31 ఎంఎస్‌ఎంఈ పార్కు లకు సంబంధించిన పనులు వివిధ దశల్లో ఉన్నా యి. చిత్తూరు జిల్లాలో బోడుమల్లివారి పల్లి (పీలేరు) మొలకలదిన్నె(మదనపల్లి),గండ్రాజు పల్లి, పలమనూరు, అనంతపురం జిల్లాలొ కోటిపి (హిందూపురం అర్బన్‌), కప్పలబండ, రాప్తాడు, ఆర్‌. అనంతపూర్‌కర్నూలు జిల్లా :బ్రాహ్మణపల్లి, తంగ దాంచ(నందికొట్కూరు) బనగానపల్లి, కడప జిల్లా యాదవపురం, నెల్లూరు జిల్లా బొడ్డువారి పాలెం, కె.కె.గుంట, ప్రకాశం జిల్లా రఘమా కపల్లి, (దర్శి), మాలకొండాపురం (కనిగిరి), గుంటూరు జిల్లా :పిడుగురాళ్ళ, పోతవరం,రాయవరం, కృష్ణాజిల్లా చల్లపల్లి, పెద్దవరం, జి.కొండూరు, పశ్చిమగోదావరి జిల్లా రాంసింగవరం, శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి, విజయనగరం జిల్లా కొంగ వానిపాలెం, విశాఖపట్నం జిల్లా గుర్రంపాలెం, రాచపల్లి,జిగురుపాడు, తూర్పు గోదావరి జిల్లా వేములపల్లి, పెద్దాపురం లో ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటు వివిధ దశల్లో ఉంది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు, డ్రెయిన్ల ఏర్పాటు పూర్తవ్వగా విద్యుత్‌ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆర్‌.అనం తపురంలో ఎంఎస్‌ఎంఈ అగ్రిమెంట్‌ ఒప్పందాన్ని రద్దు చేశారు.

కార్పొరేషన్ల‌కు భాగస్వామ్యం
ఎంఎస్‌ఎంఈ రంగాన్ని బలోపేతం చేయడం లో భాగంగా వివిధ కార్పొరేషన్లకు భాగస్వామ్యం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ ఇండస్ట్రీయల్‌ కార్పొరేషన్‌, ఏపీ ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌, ఏపీ ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్‌, ఇన్‌ఫాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ను భాగస్వామ్యం చేయడంతో పాటు ఆయా కార్పొరేష్ల విధుల్ని పునర్నిర్మిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 33.87 లక్షల ఎంఎస్‌ ఎ ంఈలు పనిచేస్తున్నాయి. తద్వారా 56.20 లక్షల మందికి ఉపాధి లభి స్తోంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, ఉపాధి కల్ప నపై ఈ రంగం బహుముఖ ప్రభావాన్ని చూపు తోంది. దేశీయ, ప్రపంచ మా ర్కెట్లలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమించడం కోసం వివిధ కార్పొ రేష న్లను ఒకే గొడుగు కింద కు తీసుకువచ్చి వాటి తోడ్పాటుతో ఎంఎ స్‌ఎంఈ రంగాన్ని బలోపేతం చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. రాష్ట్రంలో పరిశ్రమల్ని ప్రోత్సహిం చడంలో భాగంగా ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ కింద ఆన్‌లైన్‌, సింగిల్‌ డెస్క్‌ పోర్టల్‌ ద్వారా పెట్టుబడికి ముందు, పెట్టుబడి తరు వాత వివిధ సేవల్ని అందిస్తున్నారు. వ్యాపారం, పారిశ్రామిక రంగం అభివృద్ధికి వ్యూహాలు రూపొం దించడంతో పాటు ప్రోత్సహకాలు ప్రభుత్వం అందిస్తోంది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల్ని ప్రోత్సహించడంలో భాగంగా ప్లాటెడ్‌ ఫ్యాక్టరీలను సృష్టించడానికి, ప్లగ్‌, ప్లే సౌకర్యాలతో ప్రత్యేకమైన ఎంఎస్‌ఎంఈ పార్కుల్ని అనుమతించడం కోసం ఓ బలమైన వ్యవస్థ అవసరమని ప్రభుత్వం భావించింది. ఇప్పటికే ఉన్న యూనిట్లు పూర్తిస్థాయి సామర్థ్యం తోపనిచేయడంతో పాటు స్కేల్‌ ఆఫ్‌ ఎకానమీ నుంచి ప్రయోజనం పొందే విధంగా స్థానికంగా, అంతర్జాతీయంగా తమ ఉత్పత్తుల్ని మార్కెటింగ్‌ చేసుకొనే విధంగా వివిధ కార్పొరేషన్ల సేవల్ని సమ్మిళితం చేయనుంది. పరిశ్రమల కమిష నరేట్‌తో నోడల్‌ పాయింట్‌గా తీసుకువచ్చేందుకు యాక్షన్‌ప్లాన్‌ రూపొందించిన ప్రభుత్వం ఈ మేరకు విధి విధానాలను రూపొందించింది.

అధ్యయనం కోసం విదేశాలకు
ఏపీఐడీసీ, ఏపీటీపీసీ, ఎంఎస్‌ఎంఈ, ఐఎన్‌సీ ఏపీ కార్పొరేషన్లను భాగస్వామ్యం చేసి సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల్ని అభివృద్ధి చేయాలనే ఆలొచనకు సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి వచ్చినట్లు సమా చారం. వీటివల్ల పెద్ద సంఖ్యలో ఉపాధి లభిస్తుం దని, తద్వారా నిరుద్యోగం తగ్గుతుంన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. విదేశాల్లో ఎంఎస్‌ఎంఈ సెక్టా ర్‌పై అధ్యయనం చేసి ఆమేర ఇక్కడ చేర్పులు, మా ర్పులు చేయాలని నిర్ణయించారు. ఏఏ రంగాల్లో ఎంఎస్‌ఎంఈలు నడుస్తున్నాయో అధ్యయనం చేసి వాటిని రాష్ట్రంలో నెలకొల్పడం ద్వారా ఉపాధి అవకాశాలను మెరుపర్చనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఐఏఎస్‌ల బృందం త్వరలో విదేశాల్లో పర్యటించనుంది.

కాలుష్యాన్ని నివారించడం, ఉత్పత్తుల తయారీ లో అత్యాధునిక విధానాలు, ఉద్యోగాల కల్పన తది తర అంశాలపై ఐఏఎస్‌ల బృందం అధ్యయనం చేయనుంది. ప్రతిజిల్లాలో 2 క్లస్టర్ల చొప్పున ఎంఎ స్‌ఎంఈలను నెలకొల్పేవిధంగా చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తక్కువ ధరలకు లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు భూమిని స మకూర్చేం దుకు రాష్ట్ర వ్యాప్తంగా 31 ఎంఎస్‌ఎంఈ పార్కుల్ని ఏర్పాటు చేసింది. డిమాండ్‌కు అనుగుణంగా తక్షణ వినియోగానికి అనువైన ఎంఎస్‌ఎంఈ పార్కుల్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఎంఎస్‌ఈ – సీడీపీ పథకం కింద గుర్తించిన 5 కొత్త సామర్థ్య క్లస్టర్లు రూ.60.80 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది. వీటితో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్ట్‌ ఆధారిత 20 క్లస్టర్లను రూ.191.32 కోట్లతో ఏపీఐఐసీ అభివృద్ధి చేస్తోంది. ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. మార్చి నెలల్లో రూ.560కోట్ల మేర ప్రోత్సాహ కాలను అందించనునట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement