Friday, November 22, 2024

ఉగాది పండుగ వేళ నిరాశ.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అందని జీతాలు!

ఉగాది పండుగ వేళ.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు నిరాశలో ఉన్నారు. వారికి మార్చి నెలకు సంబంధించిన జీతాలు ఇంకా జమ కాలేదు. దీంతో ఉగాది పండుగ పూట జీతాలు తొందరగా పడి పోతాయని ఆశ పడ్డ ఉద్యోగులకు మళ్లీ నిరాశే మిగిలింది. జీతాల చెల్లింపు కోసం కొత్తగా తయారు చేసిన సాఫ్ట్‌ వేర్‌ పేరోల్‌ వెబ్‌ పనిచేయక పోవడంతోనే.. జీతాలు చెల్లింపులో ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సాఫ్ట్‌ వేర్‌ ఆర్టీఐకు అనుసంధానం కాకపోవడంతో మళ్లీ పాత పద్ధతిలోనే జీతాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నెల 7వ తేదీ తర్వాతనే జీతాలు పడనున్నాయని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement