Tuesday, November 26, 2024

ఏపీ గవర్నర్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్

ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరి చందన్‌ పూర్తిగా కోలుకున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగవ్వడంతో మంగళవారం రాత్రి డిశ్చార్జి చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజీ) చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి హెల్త్ బులిటెన్ లో వెల్లడించారు. ఆక్సిజన్‌ స్థాయి, ఇతర ఆరోగ్య ప్రమాణాలు అన్నీ సాధారణ స్థితికి రావడంతో డిశ్చార్జ్‌ చేశారు.

కరోనా బారిన పడి కోలుకున్న గవర్నర్ బిశ్వభూషన్..  మరోసారి అస్వస్థతకు గురయ్యారు. కోవిడ్‌ అనంతర సమస్యలతో బాధ పడుతున్న గవర్నర్‌ వారం క్రితం హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో అడ్మిట్‌ అయిన విషయం తెలిసిందే. నవంబర్ 15న గవర్నర్ బిశ్వభూషన్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన అదే నెల 17న గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. అనంతరం ఆయనకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. నెగిటివ్ గా నిర్ధారణ కావడంతో నవంబర్ 23న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అయితే, మరోసారి ఆయ అస్వస్థతకు గురి కావడంతో విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుని ఏఐజీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement