Sunday, November 17, 2024

ఏపీ, తెలంగాణ ఆస్తుల విభ‌జ‌నపై సుప్రీంకోర్టులో ఏపీ స‌ర్కార్ పిటిష‌న్..

తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆస్తుల విభ‌జ‌న‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేసింది. ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్ తొమ్మిది, పది సంస్థల విభజనలో ఆలస్యంపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ షెడ్యూల్లో ఉన్న సంస్థల విలువ దాదాపు1,42,601 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపింది. విభజన అంశంలో తెలంగాణ స్పందించకపోవడం.. ఏపీ ప్రజల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అవుతుందని వ్యాఖ్యానించింది. ఈ సంస్థలు దాదాపు 91% తెలంగాణలోనే ఉన్నాయని గుర్తు చేసింది. ఇందులో పనిచేస్తున్న దాదాపు లక్ష మందికిపైగా ఉద్యోగులు అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నారని పేర్కొంది. ఈ సంస్థల విభజన ఆలస్యం కావడం వల్ల ఏపీ నష్టపోతోందని తెలిపింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement