Tuesday, November 26, 2024

Delhi | ఢిల్లీ పర్యటనలో ఏపీ ప్రభుత్వ విప్ ఉదయభాను.. రైల్వే మంత్రితో భేటీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు రైల్వే సమస్యలపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో చర్చించానని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను వెల్లడించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం వైఎస్సార్సీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్‌తో కలిసి కేంద్రమంత్రిని, రైల్వే బోర్డ్ ఛైర్మన్ అనిల్ కుమార్ లాహోటిలను కలిశారు. అనంతరం ఉదయభాను ఆంధ్రప్రదేశ్ భవన్‌లోని గురజాడ కాన్ఫరెన్స్ హాల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు.

గూడ్స్ రైళ్ల రాకపోకల కోసం మోటమర్రి-జగ్గయ్యపేట లైన్ వేశారని, అనంతరం దాన్ని విజయవాడ నుంచి సికింద్రాబాద్ వరకు విస్తరించారని, ఈ మార్గం ద్వారా విజయవాడ – సికింద్రాబాద్‌కు 35కి.మీ దూరం తగ్గి సమయం ఆదా అవుతుందని వివరించారు. గూడ్స్ లైన్‌ను ప్యాసింజర్ లైన్‌గా మార్చే అంశాన్ని రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లామని ఉదయభాను చెప్పారు. మోటమర్రి, జగ్గయ్యపేట తదితర పరిసర ప్రాంత ప్రజలు రైలు ప్రయాణానికి విజయవాడ లేదా ఖమ్మం వెళుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. గూడ్స్ లైన్‌ను పాసెంజర్ లైన్‌గా మార్చడంపై కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారని ఉదయభాను వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement