తాలిబన్‌ల వశమైన ఆఫ్గనిస్థాన్‌లో ప్రజలంతా ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నారు. అక్కడ భారతీయులతోపాటు అనే దేశాల ప్రజలు చిక్కుకుపోయారు. ఆఫ్‌గన్ లో ఉన్న భారతీయులను వెనక్కి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఆఫ్గన్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పౌరులు కూడా చిక్కుకుని పోయారు. ఈ క్రమంలో ఆఫ్గానిస్థాన్ లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆఫ్గన్‌లో చిక్కుకున్న తెలుగు ప్రజల కోసం కార్మిక శాఖలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏపీ సర్కార్ ఏర్పాటు చేసింది. అఫ్ఘాన్‌లో చిక్కుకున్న తెలుగు వారు 0866-2436314, 7780339884, 9492555089 నంబర్లకు ఫోన్ చేసి వివరాలను తెలపవచ్చని కార్మిక శాఖ పేర్కొంది.
మరోవైపు భారత ప్రభుత్వం కూడా అక్కడ చిక్కుకున్నవారికోసం హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. 91 11 4901 6783, 91 11 4901 6784, 91 8010611290 నంబర్లను సంప్రదించడం ద్వారా ప్రభుత్వ సహాయాన్ని పొందవచ్చు. అంతేకాదు ఇండియాకు రావాలనుకునే ఆఫ్ఘనీలకు ప్రత్యేక వీసాలను జారీ చేసేందుకు కేంద్రం అంగీకరించిన సంగతి తెలిసిందే.
ఈ వార్త కూడా చదవండిః ఆఫ్గన్ లో రెచ్చిపోతున్న తాలిబన్లు.. 150 మంది కిడ్నాప్!