Saturday, November 23, 2024

జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. అగ్రవర్ణ పేదల కోసం..

ప్రజల సంక్షేమమే ధేయ్యంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. ఈడబ్ల్యూఎస్‌ సంక్షేమ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) శాఖను ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులిచ్చింది. ఈ శాఖ పరిధిలోకి కమ్మ,రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, కాపు, ఆర్య వైశ్య కార్పొరేషన్లు రానున్నాయి. అలాగే జైన్‌ల సంక్షేమానికి, సిక్కుల సంక్షేమానికి వేర్వేరు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ రెండు జీవోలను జారీ చేసింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో వీటి ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి: తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: జేపీ నడ్డాతో ఈటల

Advertisement

తాజా వార్తలు

Advertisement