Sunday, November 24, 2024

కోవిడ్ ఆస్పత్రులపై ప్రభుత్వ కొరడా.. రూ.16 లక్షలు జరిమానా!

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. కొంతమంది డాక్టర్లు కరోనా కు వైద్యం చేసి మంచి పేరు తెచుకుంటుంటే, మరికొన్ని కార్పొరేట్ ఆసుపత్రిలు ఇదే అదనుగా కరోనా పేషెంట్ ల భయాన్ని సొమ్ము చేసుకుంటున్నాయి. కొన్ని హాస్పిటల్స్ పై కఠిన చర్యలు తీసుకున్న వీళ్ళు ఏ మాత్రం మారట్లేదు. తాజాగా కర్నూలు జిల్లాలో 17 కోవిడ్ హాస్పిటళ్లపై ప్రభుత్వానికి పిర్యాదులు అందగా, ఆయా హాస్పిటళ్ళకు షో కాజ్ నోటీసులు పంపించారు ఇప్పటివరకు మూడు హాస్పిటల్ కు జరిమానా విధించిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు జిల్లాలో తాజాగా మరో మూడు హాస్పిటల్ కి రూ .16 లక్షలు జరిమానా విధించారు.

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తరుణంలో చికిత్సను కూడా వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ ఆసుపత్రుల గురించిన తెలిసిన విషయమే. తమ వద్దకు ప్రాణాలు అరచేత పట్టుకొని ఊపిరి ఆడక వచ్చిన వారిపై కూడా ఏమాత్రం కనికరం అనేది లేకుండా లక్షల్లో ఫీజులు గుంజాయి. ప్రాణాలను తమ వ్యాపార పావులుగా మార్చి మహమ్మారితో ఆసుపత్రులు ఆడిన ఆటలో ఎందరో అమాయకులు తమ ప్రాణాలను కోల్పోయారు. చివరికి శవాలతో కూడా వ్యాపారం చేసిన ఘనత కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యానికే దక్కుతుంది. ఆరోగ్య శ్రీ పథకంతో వచ్చిన వారికి కూడా లక్షల్లో బిల్లులు వేసిన వైనం తెలిసిందే. కార్పొరేట్ ఆసుపత్రుల ఉదంతాలు ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఆసుపత్రుల ధన దాహానికి కళ్లెం వేసేందకు చర్యలు చేపట్టింది.

అయితే ఆసుపత్రుల ధన దాహంపై అఖిల భారత న్యాయవాద సంఘం ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణలో భాగంగా ప్రతి ఆసుపత్రి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే చికిత్స అందించాలని తెలపడంతో పాటు, ప్రతి ఆసుపత్రి ప్రభుత్వ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ నోడల్ అఫీసర్ల విధులను నిర్థారించింది. అంతేకాకుండా ప్రతి ఆసుపత్రిలో ఇప్పటి వరకు జరిగిన నగదు బదీలీలను సరిచూసి ఎక్కువ మొత్తంలో రాబట్టిన ఆసుపత్రుల వద్ద నుంచి నగదును బాధితులకు తిరిగి ఇప్పించాలని కలెక్టర్లకు సూచించింది. ఇందులో భాగంగానే 5 రోజుల క్రితం కర్నూల్ నగరంలోని గాయత్రి, టిఎస్ఆర్, మరో ప్రైవేటు ఆసుపత్రి పై చర్యలు చేపట్టిన కలెక్టర్ ఆయా ఆసుపత్రులకు దాదాపు రూ.  లక్షలను ను జరిమానా విధించారు. వీటిలో రెండు ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు.

ఇక, ఆరోగ్యశ్రీ నిబంధనలు పాటించని మూడు ఆసుపత్రులకు జరిమానా విధిస్తూ ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త డా.సుమన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలోని వీఆర్‌ ఆసుపత్రికి రూ.6 లక్షలు, అమీలియా ఆసుపత్రికి రూ.8 లక్షలు, సంజీవిని ఆసుపత్రికి రూ.2 లక్షల చొప్పున జరిమానా విధించడం గమనార్హం. ఈ సందర్బంగా ప్రజలకు ఒరిగింది ఏముందని కొందరు అంటున్నారు. ఆసుపత్రుల ధన దాహార్తిని తీర్చలేక ప్రాణాలు విడిచిన వారి సంగతేంటని, వీరి బిల్లుల దెబ్బకు దడిసి అసలు ఆసుపత్రులకు రాకుండా వ్యాధి కారణంగా మరణించిన వారి చావుల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కొన్ని చర్యలు తీసుకుని కొందరికి నగదు తిరిగి ఇచ్చారు సరే కార్పొరేట్ల ధన దాహానికి బలైన పదుల సంఖ్యలో  మరణాలకు సమాధానం ఎవరు చెబుతారంటూ నిలదీస్తున్నారు. మరి వీరికి ప్రభుత్వం , వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏమని సమాధానం చెబుతుందో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement