Monday, January 20, 2025

AP | ప‌వ‌న్ ఇంటిపై విహ‌రించింది ప్ర‌భుత్వ డ్రోన్…

  • స‌ర్వే కోసం డ్రోన్ ఎగుర‌వేసిన ఏపీ ఫైబ‌ర్ నెట్ సిబ్బంది
  • నిర్దారించిన మంగ‌ళ‌గిరి పోలీసులు
  • దీనిపై ద‌ర్యాప్తు కొన‌సాగుతుంద‌న్న డీజీపీ
  • ప‌వ‌న్ భ‌ద్ర‌త‌లో ఎటువంటి లోపాలు లేవు..


వెల‌గ‌పూడి : మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంపై ఎగిరిన డ్రోన్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ డ్రోన్ ను పోలీసులు గుర్తించారు. అది ఏపీ ఫైబర్ నెట్ సంస్థదిగా తేల్చారు. రెండ్రోజులుగా ఈ కేసులో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. ట్రాఫిక్, పారిశుద్ధ్య కాల్వల నిర్వహణ, రహదారుల స్థితిగతులపై ప్రభుత్వం అధ్యయనం చేపడుతోంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో అధ్యయనం చేస్తోంది.

పలు రకాల సర్వేలకు డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళగిరిలో టీడీపీ, జనసేన కార్యాలయాలపై డ్రోన్ ఎగిరినట్లు గుర్తించారు. ఆ సంస్థ ఉద్యోగుల‌ను కూడా దీనిపై పోలీసులు ప్ర‌శ్నించారు.. ఎటువంటి దుర‌ద్దేశ్యంతో అక్క‌డ డ్రోన్ ఎగువేయ‌లేద‌ని, విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగానే అక్క‌డ డ్రోన్ సంచ‌రించింద‌ని తెలిపారు సిబ్బంది.

ప‌వ‌న్ భ‌ద్ర‌త‌లో లోపాలు లేవు – డీజీపీ..
ఉపముఖ్యమంత్రి ఇంటిపై డ్రోన్ ఎగురవేయడంపై విచారణ జ‌ర‌గుతున్న‌ద‌ని పేర్కొన్నారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమ‌ల‌రావు.. నేటి ఉదయం రాజమండ్రిలో ప‌ర్య‌టించిన ఆయ‌న పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్‌బంక్‌ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన డీజీపీ.. పవన్ భద్రత అంశాన్ని సీరియస్‌గా విచారణ చేస్తున్నట్లు తెలిపారు. పవన్ ఇంటిపై డ్రోన్ కెమెరా ఎగిరిన ఘటనపై పోలీస్ శాఖ సీరియస్‌గా దర్యాప్తు చేస్తోందని, డ్రోన్‌ ఎగరడంపై పోలీసులు ముఖ్యమైన సమాచారాన్ని సేకరించారని తెలిపారు.

- Advertisement -

అయితే ఈరోజు కూడా విచారణ కోసం కొంత సమయం కావాలని పోలీసులు అడిగారని.. నేటి సాయంత్రానికి డ్రోన్ కెమెరా ఎగిరిన అంశానికి సంబంధించి మొత్తం విచారణ పూర్తి అవుతుందని డీజీపీ తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ ఏజెన్సీ పర్యటనలో భద్రతాపరంగా ఎలాంటి లోపం లేదని స్పష్టం చేశారు. ఇక పవన్ పర్యటన తర్వాత వచ్చిన వ్యక్తి ఎవరనే విషయంపైనా విచారణ జరుగుతుందని ద్వారకా తిరుమల రావు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement