పీఆర్సీ అంశంపై మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి నేతల చర్చలు అసంపూర్తిగా ముగిసింది. మంత్రుల కమిటీ ముందు స్టీరింగ్ కమిటీ 3 ప్రతిపాదనలు ఉంచింది. దీనిపై చర్చించి మళ్లీ చెప్తామని మంత్రులు కమిటీ పేర్కొంది.
కాగా, హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌లు, రికవరీ అంశాలపై చర్చలు జరిపినట్లు సమాచారం. అలాగే జనవరి నెల పాత వేతనాలపై మంత్రుల కమిటీ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాధ్, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి పాల్గొన్నారు. మంత్రుల కమిటీ నుంచి లిఖిత పూర్వకంగా ఆహ్వానం వచ్చినందున స్టీరింగ్ కమిటీ వెళ్లింది.