ఏపీలో పీఆర్సీ వివాదం ఇంకా కొనసాగుతోంది. ప్రభుత్వం విడులు చేసిన జీవోను రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వం చర్చలకు ఆహ్వానలు పంపుతోంది. తాజాగా కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న పీఆర్సీ సాధన సమితికి ఏపీ ప్రభుత్వం నుంచి మరోమారు ఆహ్వానం అందింది. పీఆర్సీపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో చర్చలకు రావాలని కోరింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటకు సచివాలయంలో చర్చించుకుందామంటూ సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ పీఆర్సీ నేతలను ఆహ్వానించారు.
అయితే, ప్రభుత్వ ఆహ్వానాన్ని పీఆర్సీ సాధన సమితి నేతలు తిరస్కరించారు. మంత్రుల కమిటీ ఎదుట ఇప్పటికే తమ మూడు డిమాండ్లు ఉంచామని, వాటిపై నిర్ణయం తీసుకునే వరకు చర్చలకు రాబోమని ఇది వరకే తేల్చి చెప్పారు.