Friday, November 22, 2024

Breaking: ఏపీలో థియేటర్లు రీ ఓపెన్.. ఓనర్లకు ఛాన్స్ ఇచ్చిన సర్కార్

ఆంధ్రప్రదేశ్ లో సీల్ అయిన థియేటర్ల ఓనర్లకు ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా నిబంధనలు పాటించడం లేదంటూ సీజ్ చేసిన థియేటర్లను తిరిగి ఓపెన్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఫైన్లు కట్టి రీ ఓపెన్ చేసుకునేందుకు ఛాన్స్ కల్పించింది. మచిలీపట్నంలో మూతపడ్డ థియేటర్ ల యజమానులు మంత్రి పేర్ని నానిని కలిశారు. థియేటర్లు మూసివేత, టికెట్‌ రేట్లపై ఆయనతో చర్చిస్తున్నారు.

ఈ సందర్భంగా.. టికెట్ల రేట్లపై జీవో 35 అమలులో ఉన్నా.. ధరల నిర్దారణ కోసం ఓ కమిటీనీ వేశామని మంత్రి అన్నారు. కమిటి రిపోర్ట్ ఆధారంగా మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పారు. సీల్ అయిన థియేటర్లను ఓపెన్ చేసేందుకు అనుమతి ఇచ్చారు. థియేటర్ యజమానులు జాయింట్ కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. నెలరోజులు గడువుతో నిబంధనలు పాటించే అవకాశం ఇచ్చామని మంత్రి పేర్ని నాని చెప్పారు. ప్రభుత్వ అధికారులు గుర్తించిన లోపాలను థియేటర్ల యజమానులు సరిదిద్దుకోవాలని చెప్పారు. అలాగే, ఆయా థియేటర్లలో నెల రోజుల్లో అన్ని వసతులు కల్పించాల‌ని మంత్రి పేర్ని నాని సూచించారు.

కాగా, ఏపీలో నిబంధ‌న‌లు ఉల్లంఘించిన‌ సినిమా థియేటర్లను ఇటీవ‌ల అధికారులు మూసివేయించిన విష‌యం తెలిసిందే. తొమ్మిది జిల్లాల్లో చేసిన 83 థియేటర్లను సీజ్ చేశారు. సినిమా టికెట్స్ ధరల విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 35 నిబంధనలను పాటించని థియేటర్లను అధికారులు సీల్ వేశారు. అన్ని జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లు, రెవిన్యూ అధికారులు తనిఖీలకు చేశారు. ఈ సందర్భంగా నిబంధనలు పాటించని పదుల సంఖ్యలో థియేటర్లకు సీల్ వేశారు. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ప్రకారం టికెట్స్ ధరలు తమకు వర్కౌట్ కాదంటూ పలు జిల్లాల్లో స్వచ్చందంగా కొన్ని థియేటర్లను యజమానాలు మూసివేశాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement