అమరావతి – వైయస్సార్సీపి నేత గౌతమ్ రెడ్డికి బిగ్ రిలీఫ్ దక్కింది. నకిలీ డాక్యుమెంట్లతో స్థలాన్ని కబ్జా చేశారనే అభియోగాలపై ఆయనపై నమోదైన కేసులో అరెస్ట్ నుంచి మద్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు నేడు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ జరిగే వరకు నేత గౌతమ్ రెడ్డిని అరెస్టు చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది.
అలాగే ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ అయ్యాయి. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది సుప్రీం కోర్టు. ఇక నేడు గౌతమ్ రెడ్డి తరఫున న్యాయవాదులు సిద్ధార్థ దవే, అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు.