ఆంధ్ర ప్రభ స్మార్ట్ – అమరావతి . :ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇవ్వకుండా వదిలేసిన రేషన్ కార్డుల జారీకి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. వివాహ ధ్రువపత్రం చూపిస్తే కొత్త జంటకు రేషన్ కార్డు ఇచ్చే విధానాన్ని అమలు చేయనుంది. మరోవైపు జగన్ బొమ్మ తొలగించి మళ్లీ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు నిర్ణయించింది.
కొత్త గా పెళ్లి అయిన జంటకు రేషన్ కార్డు జారీ : వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో కోటీ 47 లక్షల 33 వేల 44 రేషన్ కార్డులు ఉన్నాయి. 2024 ఆగస్టుకి వాటి సంఖ్య కోటీ 48 లక్షల 43 వేల 671కి చేరింది. అంటే గత ఐదేళ్లలో పెరిగిన కార్డులు లక్షా 10 వేలు మాత్రమే. పెళ్లైన వారికి కొత్తగా కార్డులు ఇవ్వాలంటే అప్పటికే వారి కుటుంబానికి ఉన్న రేషన్ కార్డుల నుంచి పేర్లు తొలగించాల్సి ఉంటుంది.
దీనికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఫలితంగా కొత్తగా పెళ్లైన వారికి కార్డులు అందలేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు వివాహ నమోదు పత్రం ఆధారంగా కొత్త జంటకు రేషన్ కార్డు జారీ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.