విజయవాడ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబైకి గంటన్నరలో చేరుకోవచ్చు. గన్నవరం విమానాశ్రయం నుంచి ముంబైకి ఇక నుంచి నేరుగా విమాన సర్వీసులు నడపనున్నారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్లు గన్నవరం నుంచి ముంబైకి ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ కొత్త విమానాన్ని ప్రారంభించారు.
ఈ విమానం ముంబై నుంచి మధ్యాహ్నం 3.57 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. రాత్రి 7.10 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి రాత్రి 9.00 గంటలకు ముంబైలో దిగుతుంది. ఈ విమాన సర్వీసు ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని… కొత్త ప్రభుత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఎంపీ బాలశౌరి అన్నారు.
ఏపీ రాజధానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కావాలని.. ఇతర ప్రాంతాలకు కూడా ఎయిర్ లైన్ సర్వీసులు కావాలని బాలశౌరి పేర్కొన్నారు. రాజధానికి కావాల్సిన అన్ని సర్వీసులు త్వరలోనే మొదలవుతాయన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రానికి మరిన్ని విమానాలు రావటానికి తమ శాయశక్తులా కృషి చేస్తామన్నారు.