Friday, November 22, 2024

AP | మంత్రులకు షాక్.. చాంబర్ ఖాళీ చేయాలని జీఏడీ ఆదేశం

మంత్రులకు బిగ్ షాక్ ఇచ్చింది సాధారణ పరిపాలన విభాగం. మంత్రుల పేషీలకు జూన్ 3న తాళాలు వేస్తామని, ఆలోగా వాళ్లను ఖాళీ చేయించాలని జీఏడీ వెల్లడించిందిఆ తేదీ లోగా మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటామని ఆయా కార్యాలయాల సిబ్బందికి సూచించింది. ఆ లోగా మంత్రు.లందరూ తమ తమ ఛాంబర్ లు ఖాళీ చేయాలని కోరింది.

.

చిన్న కాగితం కూడా తీసుకు వెళ్ళ వద్దు…

సీఎంగా జగన్ మోహన్ రెడ్డి పదవీ కాలం ముగియనుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. తమ అనుమతి లేకుండా సచివాలయం నుంచి చిన్న వస్తువును కూడా తరలించొద్దని తేల్చి చెప్పింది. తమ అనుమతి లేకుండా పత్రాలు, వస్తువులు బయటకు తీసుకెళ్లడానికి వీళ్లేదని సూచించింది.

- Advertisement -

ముఖ్యంగా మంత్రుల పేషీలు, ప్రభుత్వ శాఖల్లోని దస్త్రాలు, కాగితాలపై నిఘా పెట్టాలని, అనుమతి లేకుండా తీసుకెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సచివాలయంలో రాకపోకలపై మరింత దృష్టి సారించాలని, తప్పనిసరిగా తనిఖీలు చేసిన తర్వాతనే లోపలికి అనుమతించాలని ఆదేశించింది.

. .

Advertisement

తాజా వార్తలు

Advertisement