Saturday, November 23, 2024

AP | పంచాయతీ లకు నిధులు విడుదల చేయాలి..

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : గత ప్రభుత్వాహయంలో 14, 15వ ఆర్థిక సంఘ నిధులు పెద్ద ఎత్తున దారి మళ్లించారని, వాటిని తక్షణమే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. విజయవాడలోని బాలోత్సవ భవన్ లో ఆదివారం ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించి, భవిష్యత్తు కార్యాచరణ పై సుదీర్ఘంగా చర్చించి, పలు నిర్ణయాలు తీసుకున్నారు.

అలాగే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఛాంబర్ తరఫున నాయకత్వం వహించి గెలుపొందిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకరును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 12,918 గ్రామ పంచాయతీలకు పంపించిన నిధులను గత రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించివేసి, తన సొంత అవసరాలకు వాడుకొందని ఆరోపించారు.

ఆ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏపీ పంచాయతీ రాజ్ సాంబార్, ఏపీ సర్పంచ్ల సంఘం ద్వారానే ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేసినా గత ప్రభుత్వానికి చీమకుట్టినట్లు అయినా లేదన్నారు. దాని ఫలితమే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలు అవడానికి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు, ఎంపీపీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రధాన కారణమని తెలిపారు.

కష్టపడి పని చేసి నిబద్ధతతోఉండి మంచి ఉన్నత స్థితికి చేరుకున్న ఎంపీ కలిసేట్టి అప్పలనాయుడు, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకరకు చాంబర్ తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచ్ సంఘానికి ఏ విధమైన సహాయ సహకారాలు కావాల్నా తాము ఎపుడూ అందుబాటులో ఉంటామని ఎన్నికైన ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement