Sunday, November 17, 2024

AP: న్యాయస్థానం నుంచి దేవస్థానం.. నేటి పాదయాత్ర వివరాలు ఇలా..

అమరావతి రైతుల ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’మహా పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్ర ప్రారంభానికి ముందు వేంకటేశ్వరస్వామి, న్యాయదేవత ప్రతిమలకు పూజలు నిర్వహించారు. ఆ తర్వాత సర్వమత ప్తార్ధనలు చేశారు. ఏకైక రాజధానిగా అమరావతి పరిరక్షణ కోసం ఈ యాత్రను చేపట్టారు. పాదయాత్రలో పెద్ద ఎత్తున రైతులు, మహిళలు, వివిధ రాజకీయపక్షాల నేతలు పాల్గొన్నారు.

ఈ మహా పాదయాత్ర మొత్తం 45 రోజులపాటు కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా జరిగే ఈ యాత్ర డిసెంబరు 17న తిరుపతిలో ముగియనుంది. అమరావతి రైతులు యాత్రకు విపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి.

నేటి పాదయాత్ర సాగుతుందిలా..

అమరావతి మహాపాదయాత్ర శుక్రవారం (05/11/2021) వివరములు :
?రోజు:- శుక్రవారం ఉదయం 08:00 గంటలకు
?ప్రారంభ ప్రాంతం:- ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం నుండి
?భోజన విరామ సమయం/ ప్రాంతం:- పెద్దనందిపాడు మండలం అబ్బినేనిగుంటపాలెం
?మధ్యాహ్న ప్రారంభ ప్రాంతం:- పెద్దనందిపాడు మండలం అబ్బినేనిగుంటపాలెం మధ్యాహ్నం 3 : 00 గంటలకు
?ముగింపు ప్రాంతం:- పెద్దనందిపాడు మండలం పెద్దనందిపాడు క్లబ్ (శుక్రవారం రాత్రి బస )
?నడిచే కిలోమీటర్లు:- 15km సుమారు

Advertisement

తాజా వార్తలు

Advertisement