వెలగపూడి – ఎపిలో మహిళలకు ఫ్రీ-బస్ స్కీమ్ అమలుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. ఈ స్కీమ్ కు సంబంధించి విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉప సంఘంను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ చైర్మన్ గా ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ మండిపల్లిన రాంప్రసాద్ రెడ్డి ని ప్రభుత్వం నియమించింది. సభ్యులుగా మహిళా శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, హోం మినిస్టర్ అనితను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో పర్యటించనుంది. అక్కడ స్కీమ్ అమలు తీరు పరిశీలించి సలహాలు, సూచనలు చేయనుంది. సంక్రాంతి లోపలే ఈ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement