అమరావతి – తెలంగాణ నుంచి కేంద్ర ఆదేశాల మేరకు ఏపీకి వెళ్లిన ఐఏఎస్ అధికారులకు కూటమి ప్రభుత్వం కీలక పోస్టింగ్‌లు ఇచ్చింది. ఆమ్రపాలిని టూరిజం ఎండీగా ఏపీ ప్రభుత్వం నియమించింది… దాంతోపాటు ఆమెకు టూరిజం అథారిటీ సీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
వైద్యఆరోగ్య శాఖ కమిషనర్‌గా వాకాటి కరుణ నియమితులవ్వగా.. ఆమెకు నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీప్రసాద్ నియమితులయ్యారు. దీంతో ఎంఎం నాయక్‌ను అదనపు బాధ్యతల నుంచి తొలగిస్తూ కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
అలాగే, ఆర్కియాలజీ అండ్ మ్యూజియం కమిషనర్ జి.వాణీమోహన్‌ను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. జీఏడీ ప్రధాన కార్యదర్శిగా వాణీమోహన్‌కు బాధ్యతలు కూడా అప్పగించారు.
ప్రస్తుతం ఆ బాధ్యతలు చూస్తున్న పోలా భాస్కర్‌ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, తెలంగాణ నుంచి ఏపీ కేడర్‌కు వెళ్లిన రోనాల్డ్ రోస్‌కు ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు.