Wednesday, November 20, 2024

AP : 20 నుంచి స‌బ్సిడీ విత్త‌నాలు పంపిణీ

- Advertisement -

ఏపీ రైతులకు శుభవార్త.. సబ్సిడీపై రైతులకు విత్తనాలు అందించనుంది జగన్ సర్కార్. ఈనెల 20వ తేదీ నుంచి సబ్సిడీపై రైతులకు విత్తనాలు అందించేందుకు సిద్ధమైంది. ఖరీఫ్ సీజన్ కోసం ఈనెల 20వ తేదీ నుంచి సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇందుకోసం 16.19 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేశారు. . పచ్చి రొట్ట, చిరుధాన్యాల విత్తనాలపై 50శాతం అలాగే వేరుశనగపై 40శాతం సబ్సిడీ ఇవ్వనుంది. ఎన్ ఎఫ్ ఎస్ ఎం పరిధిలోని జిల్లాలలో వరి విత్తనాలు క్వింటాల్ 1000 రూపాయలు, మిషన్ పరిధిలో లేని జిల్లాలలో 500 రూపాయల చొప్పున సబ్సిడీ ఇస్తారు. ఈ మేరకు ఏపీ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ స‌బ్సీడీ కోసం రూ.450 కోట్లు ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేయ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement