గుంటూరు జిల్లా మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి కోర్టులో మరోసారి చుక్కెదురైంది. బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో విధినిర్వహణలో ఉన్న కారంపూడి సీఐ నారాయణ స్వామిపై, టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి కేసుల్లో పిన్నెల్లిని పోలీసులు అరెస్టు చేసి నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉంచారు. కాగా, ఈ రెండు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిన్నెల్లి పిటిషన్ దాఖలు చేసుకోగా… బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.