Tuesday, November 26, 2024

ఏపీ మాజీమంత్రి నారాయణ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం మాజీ మంత్రి నారాయణ ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బెయిల్ రద్దు చేసేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఏపీ రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ లో మార్పులను నారాయణ ఉద్దేశ పూర్వకంగా చేశారంటూ సీఐడీ కేసు నమోదు చేసింది.

ఈ కేసులో సీఐడీ చర్యలు తీసుకోకముందే నారాయణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వైద్య చికిత్సల నిమిత్తం విదేశాలకు వెళ్లాల్సి ఉందని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరగా.. హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్ ను రద్దు చేయాలంటూ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ వేసింది. ఈ క్రమంలో కేసు దర్యాప్తునకు నారాయణ సహకరించకపోతే బెయిల్ రద్దును కోరవచ్చని ధర్మాసనం పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement