Saturday, November 23, 2024

AP: మెలో డ్రామాలెందుకు.. అసెంబ్లీ ఫీడ్ ఉంది.. లేని దాన్ని ఎట్లా ఆపాదిస్తారు: మంత్రి పేర్ని నాని

మా వాళ్లు అన‌ని మాట‌ల‌ను అన్న‌ట్టు టీడీపీ అధినేత చంద్ర‌బాబు మెలో డ్రామాకు తెర‌తీశారు. అస‌లు అట్లాంటి మాట‌లేవీ అన‌న‌ప్పుడు వారికి ఇంత ఇది ఎందుక‌వుతోందో అర్థం కావ‌డం లేద‌. కావాలంటే అసెంబ్లీ ఫీడ్ ఉంది. మీరే పూర్తిగా చూడండి. చెక్ చేసుకోండి. అన్నారు మంత్రి పేర్ని నాని. ఈరోజు (శ‌నివారం) మీడియాతో మాట్లాడారు మంత్రి నాని.

చంద్ర‌బాబు స‌తీమ‌ణి పేరు ఎక్క‌డా ప్ర‌స్తావ‌న‌కు రాలేదు. ఆమెను ఎవ‌రూ ఏమీ అన‌లేదు. ఎవ‌రైనా మాట్లాడిన‌ట్టు ఆధారం ఉందా? అని ప్ర‌శ్నించారు మంత్రి నాని. అయినా ఏదో అన్న‌ట్టు డ్రామా ఆడుతున్నార‌ని మండిప‌డ్డారు. చంద్ర‌బాబే సీఎం జ‌గ‌న్ త‌ల్లి, చెల్లెలిపై అన‌రాని మాట‌ల‌న్నారు. అయినా తాము సైలెంట్‌గానే ఉన్నామ‌ని, ఎటువంటి మాట‌లు అన‌లేద‌న్నారు.

అనని మాట‌ల‌ను చెబుతూ.. వాటిని పెద్ద‌వి చేసి రాద్ధాంతం చేయాల‌ని చూస్తున్నారు. అంబ‌టి రాంబాబు, ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి మాట్లాడిన‌ట్టు నంద‌మూరి ఫ్యామిలీ చెబుతోంది. ఇవ‌న్నీ వ‌ట్టి అబ‌ద్ధాలు. మీకు కావాలంటే అసెంబ్లీ ఫీడ్ ఉంది.. చెక్ చేసుకోండి అన్నారు మంత్రి పేర్ని నాని.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట్టర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement