Thursday, January 9, 2025

AP – ఆదోనిలో అక్రమ రిజిస్ట్రేషన్ – ఐదుగురు అరెస్టు

కర్నూల్ బ్యూరో – ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం పరిధిలో నకిలీ డాక్యుమెంట్ల ద్వారా అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో పోలీసులు ఐదు మంది ప్రభుత్వ అధికారులను అరెస్టు చేశారు. ఆదోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంకు చెందిన సీనియర్ అసిస్టెంట్ ఈరన్న, జూనియర్ అసిస్టెంట్ రమేశ్, డాక్యుమెంట్ రైటర్లు మహబూబ్, షబ్బీర్, సాక్షి ఇలియాస్ పోలీసులు అరెస్ట్ చేశారు.మంగళవారం వీరిని కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్ కు ఆదేశించారు.

. ఇందుకు సంబంధించిన వివరాలను టూ టౌన్ సీఐ సూర్య మనోహర్ రావు వెల్లడించారు. నిందితులను సబ్ జైలుకు తరలించినట్లు కాగా ఈ కేసులో ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని సీఐ వెల్లడించారు.

- Advertisement -

*ఈ కేసు పూర్వపరాలు :*

ఆదోనికి చెందిన ఎగ్గటి ఈశ్వరప్పకు మండిగిరి పంచాయతీలో 6.51 ఎకరాలు భూమి ఉంది. బహిరంగ మార్కెట్‌లో ఈ భూమి విలువ రూ.35 కోట్లకుపైగా ఉంది. నంద్యాలకు చెందిన ఎగ్గటి ఆముదాల భాస్కర్‌ ఈ భూమిపై కన్నేశాడు. తాను ఎగ్గటి ఈశ్వరప్పకు వారసుడినని.. ఎగ్గటి ఈశ్వరప్ప మరణించినట్లు మరణ ధ్రువీకరణ పత్రం, నకిలీ వారసత్వ పత్రాలు సృష్టించాడు. ప్రస్తుతం సదరు పొలానికి తానే వారసుడునని పెద్దమర్రివీడుకు చెందిన సి.ఈరన్నకు రూ.3.90 ఈ కోట్లకు ఈ భూమిని విక్రయించాడు. ఆదోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 2024, డిసెంబరు 31న ఈ భూమికి సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్‌ చేశారు.

ఈ విషయం గుర్తించిన భూ యజమాని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దీంతో పోలీసులు కేసు నమోదు చేసి పూర్వపరాలను పరిశీలించారు. ఈ భూమి ఈశ్వరప్పదని తేలడంతో నిందితుడు భాస్కర్, భూమిని కొన్న ఈశ్వరయ్య, గుడ్డిగా అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన ఆదోని ఇన్‌ఛార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ హాజీమియ్యా, సీనియర్‌ అసిస్టెంట్‌ ఈరన్న, జూనియర్‌ అసిస్టెంట్‌ రమేష్‌, రైటర్లపై కేసు నమోదు చేశారు.

ఇక స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన ఆదోని ఇన్చార్జి సబ్ రిజిస్టర్ తో పాటు సీనియర్, జూనియర్ అసిస్టెంట్లను కర్నూల్ స్టాంపు రిజిస్ట్రేషన్ శాఖ డిఐజి కళ్యాణి సస్పెన్షన్ చేశారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితులైన భాస్కర్, ఈరన్నలు పరారీలో ఉన్నారు.

*రెండు నెలల క్రితం :*

అంతకుముందు రెండు నెలల కింద ఇదే సబ్ రిజిస్టర్ కార్యాలయం పరిధిలోకర్నూలుకు చెందిన హనుమంతమ్మకు ఆదోని పరిధిలో రూ.1.70 కోట్ల విలువ చేసే 6 సెంట్ల స్థలంను కూడా అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారం దుమ్ము దుమారం సంగతి విదితమే. హనుమంతమ్మ స్థలంను డా.రవికిరణ్‌ అనే వ్యక్తి అతని తల్లి పేరు లక్ష్మి కాగా.. హనుమంతమ్మగా నకిలీ పత్రాలు సృష్టించారు. సదరు స్థలాన్ని 2024, అక్టోబరు 16వ తేదీన సురేష్‌బాబు అనే వ్యక్తి పేరుతో ఆదోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్‌ చేశారు. అసలు యజమాని హనుమంతమ్మ ఆదోని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అప్పట్లో వ్యవహారం దుమ్ము దుమారం రేపగా, ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే స్వయంగా కల్పించుకొని.. రిజిస్ట్రేషన్ రద్దు చేయించారు. నిందితుల పై కేసు నమోదు చేయించడం గమనారం. ఈ కేసు మరచిపోక ముందే.. తిరిగి మరో అక్రమ వ్యవహారం వెలుగులోకి రావడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement