Thursday, November 21, 2024

AP – మ‌ద‌న‌పల్లి ఆర్డీవో కార్యాల‌యంలో భారీ అగ్ని ప్ర‌మాదం… విచార‌ణ‌కు డిజిపి ప‌య‌నం

అంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – మ‌ద‌న‌ప‌ల్లి – అన్నమయ్య జిల్లా లోని ఆర్డీవో కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం ప్ర‌మాదం సంభ‌వించింది.. అర్ధరాత్రి స‌మ‌యంలో జ‌ర‌గిన ఈ ప్ర‌మాదంలో పలు కీల‌క‌మైన‌ రికార్డులతో స‌హా కార్యాల‌యంలోని మొత్తం ఫైల్స్ కాలి బూడిద‌య్యాయి.. ఆదివారం సెల‌వు దినం కావ‌డం, అర్ధ‌రాత్రి ఈ సంఘ‌ట‌న జ‌ర‌గ‌డంతో ప‌లు అనుమానాలు రేకేత్తుతున్నాయి..

విష‌యం తెలిసిన వెంట‌నే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స్పందించారు.. త‌క్ష‌ణం హెలికాప్ట‌ర్ లో సంఘ‌ట‌న స్థలానికి వెళ్ల‌వ‌ల‌సిందిగా డిజిపిని, సిఐడి చీఫ్ ను ఆదేశించారు.. దీంతో ఆయ‌న హుటా హుటిన అక్క‌డికి బ‌య‌లుదేరారు.. దీనిపై మరింత స‌మాచారం తెలియాల్సి ఉంది..

మదన పల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాద ఘటనపై సిఎం ఉన్నత స్ధాయి సమీక్ష నిర్వహించారు.

- Advertisement -


• సీఎస్, సిఎంఓ, ఇంటెలిజెన్స్ చీఫ్, పోలీసు అధికారులతో సమీక్ష
• అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్ధం అయినట్లు ప్రాథమిక సమాచారం
• అసైన్డ్, 22 ఎ, కోర్టు కేసుల ఫైల్స్, భూముల రీ సర్వే ఫైల్స్ దగ్దం అయినట్లు సమాచారం
• జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడిన సిఎం
• రాత్రి 11.24 ప్రమాదం జరిగినట్లు వివరించిన జిల్లా అధికారులు
• ఘటనపై జిల్లా అధికారుల సత్వర స్పందన లేకపోవడం పై ఆరా తీసిన సిఎం
• ఆదివారం రాత్రి 10.30 గంటలకు వరకు కార్యాలయంలో ఉన్న గౌతమ్ అనే ఉద్యోగి
• ఆదివారం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆ సమయం వరకు ఉండడానికి కారణాలు తెలుసుకోవాలన్న సిఎం
• అతను ఎందుకు వెళ్లాడు, ఏ పని కోసం వెళ్లాడు అని వివరాలు అడిగిన సిఎం
• ఘటన సమయంలో విధుల్లో విఆర్ఎ ఉన్నాడని వివరించిన అధికారులు
• ఘటనా ప్రాంతానికి పోలీసు జాగిలాలు వెళ్లాయా, ఉదయం నుంచి ఏం విచారణ చేశారు అని అడిగిన సిఎం
• ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, ఇతర ఆధారాల సేకరణ విషయంలో జాప్యం పై ప్రశ్నించిన ముఖ్యమంత్రి
• ఘటన సమయంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపైనా విచారణ జరపాలన్న సిఎం
• సిసి కెమేరాల ఫూటేజ్ వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలన్న ముఖ్యమంత్రి
• సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆ ప్రాంతంలో ఆ సమయంలో సంచరించిన వ్యక్తుల వివరాలు, వారి కాల్ డాటా సేకరించాలని ఆదేశం
• నేరాలు చేసి సాక్ష్యాలు చెరిపివేయడంలో ఆరితేరిన వ్యక్తులు మొన్నటి వరకు అధికారంలో ఉన్నారన్న సిఎం
• గతంలో సాక్ష్యాలు మాయం చేసిన ఘటనలు అధికారులు మరిపోకూడదని…ఆ కోణంలో లోతుగా దర్యాప్తు జరపాలని సిఎం అదేశం.
• ఘటనపై మినిట్ టు మినిట్ ఏం జరిగింది అనే వివరాలు సమగ్రంగా తన ముందు ఉంచాలన్న సిఎం

Advertisement

తాజా వార్తలు

Advertisement