ఏపీలో ప్రభుత్వ కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరోద్యుగులకు ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. ఏపీపీఎస్సీ ద్వారా 1180 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతించింది. ఆయుష్, రెవెన్యూతో పాటు పలు శాఖల్లో ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేయనున్నారు. గత జూన్ లో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లోకి మరిన్ని పోస్టులను చేర్చాలని నిర్ణయించింది. ఈ మేరకు 1,180 పోస్టులను భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఈ రోజు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఖాళీల్లో రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్లతో పాటు గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు EWS రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఆగస్టు నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది.
ఏపీ నిరోద్యోగులకు శుభ వార్త… 1180 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
Advertisement
తాజా వార్తలు
Advertisement