Saturday, December 28, 2024

AP – అన్నదాత కుటుంబాన్ని బలి తీసుకున్న రుణం

కడప – సింహాద్రిపురం (ఆంధ్రప్రభ) సింహాద్రిపురం మండలం, దిద్దేకుంట గ్రామంలో విషాదకర ఘటన జరిగింది. అప్పుల బాధతో ఓ అన్నదాత కుటుంబమంతా నేడు ఆత్మహత్య చేసుకుంది. రైతు నాగేంద్ర (40) చీనీ తోట సాగు చేస్తున్నారు. ఆదాయం లేకపోవడం, రుణదాతల ఒత్తిడి పెరిగిపోవడంతో దిక్కుతోచని స్థితిలో భార్య వాణి(38), పిల్లలు గాయత్రి(12), భార్గవ్(11)ను తోటకు తీసుకెళ్లి ఉరివేశాడు. అనంతరం తానూ సూసైడ్ చేసుకున్నాడు.

వివరాలలోకి వెళితే కొమెర నాగేంద్ర (40), వాణి (38) దంపతులు వ్యవ సాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమారుడు భార్గవ్ (15), కుమార్తె గాయత్రి (14) ఉండగా, ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. బంధువుల కథనం మేరకునాగేంద్ర తనకున్న ఎకరన్నర పొలంలో అయిదేళ్లుగా చీనీ తోటసాగుచేస్తున్నారు. దీంతోపాటు సుమారు 15 ఎకరాలు కౌలుకు తీసుకుని 8 ఏళ్లుగా వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. పంటల సాగు చేసేందుకు. పెట్టుబడులకు కొంతమంది వద్ద అప్పులు చేశారు. గత నాలుగే ళ్లుగా సరైన దిగుబడులు రాకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయాయి. నాగేంద్ర ట్రాక్టరును కొను గోలు చేసి నెలవారీ వాయిదాలు కడుతున్నారు. దాదాపు రూ. 20 లక్షలకు పైగా అప్పులు కావడం రుణదాతల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో మనస్థాపం చెందాడు. ఈ ఏడాది 13 ఎకరాల్లో కొర్ర పంట సాగుచేశారు. వర్షాల వల్ల సరైన దిగుబడులు రాకపో వడంతో నిరాశ చెందాడు. దీంతో దిక్కు తోచని పరిస్థితులలో బల్వన్ మరణానికి పాల్పడ్డాడు.

సింహాద్రిపురం మండలం దిద్దేకుంటలో విషాదఛాయలు

బంధువుల గ్రామ ప్రజల కథనం మేరకురైతు దంపతులిద్దరూ ముద్దనూరు వెళ్లి ఓ దుకాణంలో తాడును కొనుగోలు చేసి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. పాఠ శాల నుంచి వచ్చిన పిల్లలిద్దరితో కలిసి భోజనం చేశారు. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో మొదట దంపతులిద్దరూ చీనీ తోట వద్దకు వెళ్లారు. మొదట భర్త భార్యను ఇనుప గేటుకు ఉరేసి చంపే శారు. అనంతరం పిల్లలనూ తీసుకెళ్లి ఉరేసి చంపారు. అనంతరం తానూ ఆత్మ హత్యకు పాల్పడ్డారు. నాగేంద్ర తల్లి ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గుర్తించి బంధువులకు చెప్పారు. వారు నాగేంద్ర చరవాణికి ఫోన్ చేయగా స్విచ్ఛాప్’ వచ్చింది. స్థానికులు పొలం వద్దకు వెళ్తుం డగా చూశామని చెప్పడంతో వెంటనే అక్కడకు వెళ్లారు. ఇనుక గేటుకు నాగేంద్ర వేలాడుతూ కనిపించారు. సంఘ టనా స్థలంలో భార్య పిల్లలకు ఉరేసినట్లు గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచా రమిచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడంతో గ్రామంలో విషా దచాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement