ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల పర్యవేక్షణకు రాష్ట్ర ఎన్నికల మానిటరింగ్ అధికారి మోహన్ వచ్చారని తెలిపారు. జిల్లాకు సంబంధించి 3 ప్రాంతాల్లో ఎన్నికల పంపిణీకి ఏర్పాట్లు చేసామని. విధి నిర్వహణలో 95 శాతం మంది సిబ్బంది హాజరయ్యారని తెలిపారు.
వీరంతా ఈరోజు ఈవీఎంలు ఎలా పనిచేస్తున్నాయో పరిశీలిస్తారు. గతంలో తలెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకుని అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు అధికారులందరినీ పోలింగ్ బూత్‌లకు తరలించాం.. సిరా విషయంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది బయటి వారికి అందుబాటులో ఉండదు అని తెలిపారు.
సెంట్రల్ నియోజకవర్గంలోని 1,267 కేంద్రాల్లో పూర్తి వెబ్‌కాస్టింగ్ చేస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లాలో 14,350 మంది సిబ్బంది, 7 వేల మంది పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. స్ట్రాంగ్ రూమ్‌లలో అన్ని భద్రతా చర్యలు తీసుకున్నాం. అభ్యర్థులెవరికైనా సందేహాలుంటే గదులను పరిశీలించవచ్చని డిల్లీరావు వెల్లడించారు.