Saturday, November 30, 2024

Tirumala | శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర

తిరుమల : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లురవీంద్ర దర్శించుకున్నారు. గురువారం ఉదయం విఐపీ విరామ సమయంలో సతీసమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో కొల్లు రవీంద్రకు వేదపండితులు వేదాశీర్వచనం అందించగా… ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.

ఆలయం వెలుపల కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ… స్వామి వారి తిరుప్పావడ సేవలో దర్శించుకోవడం జరిగిందన్నారు. తిరుప్పావడ సేవలో స్వామి వారు అత్యంత శక్తివంతంగా కనిపించారని, రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే శక్తిని ఇవ్వాలని కోరుకున్నట్లు తెలిపారు. తిరుమలలో అన్ని విధాలా సమర్పులు జరుగుతున్నాయని… తిరుమలలో జరగరాని అపచారాలు జరిగాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement