Friday, November 22, 2024

AP – టెన్త్ స్టేట్ టాప్‌ ర్యాంకర్‌ మనస్వీ కి అభినందనల వెల్లువ

ఆంధ్రప్రదేశ్ టెన్త్ ఫలితాలలో మరోసారి బాలికలు సత్తా చాటారు. రాష్ట్రవ్యాప్తంగా 2803 పాఠశాలలో విద్యార్థులకు 100% ఉత్తీర్ణత సాధించగా రాష్ట్ర వ్యాప్తంగా 17 స్కూల్స్ లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. ఇక్కడ విశేషమేమిటంటే.. ఈ 17 స్కూల్స్ లో 16 స్కూల్స్ ప్రైవేట్ స్కూళ్లు కావడం. ఒక్క ప్రభుత్వ పాఠశాల ఈ లిస్టులో చేరింది. ఇక నేడు ప్రకటించిన ఫలితాలలో మొత్తం 600 మార్కులకు గానూ 599 మార్కులు సాధించి ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల వెంటక నాగ సాయి మనస్వి రాష్ట్రంలోనే టాప్‌ ర్యాంకర్‌గా నిలిచింది.

- Advertisement -

ఒక్క సెకండ్‌ ల్యాంగ్వేజ్‌ మినహా మిగతా అన్ని సబ్జెక్టుల్లో నూటికి నూరు మార్కులు సాధించింది. హిందీ సబ్జెక్ట్‌లో వందకు 99 మార్కులు వచ్చాయి. మనస్వి ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో స్టేట్ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించినట్లు ఎస్సెస్సీ బోర్డు ప్రకటించింది. స్టేట్ టాపర్‌గా నిలవడం పట్ల సాయి మనస్వి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. నాగ మనస్విని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. తమ పాఠశాల చరిత్రలో నిలిచిపోయేలా 600కు 599 మార్కులు రావడం గర్వంగా ఉందన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement